నరసన్నపేటలో స్క్రాప్‌ గోడౌన్‌ దగ్ధం

శ్రీకాకుళం, మహానాడు: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ దగ్గర ఉన్న స్క్రాప్‌ గోడౌన్‌ సోమవారం ఉదయం అగ్నికి ఆహుతి అయింది. గుర్తుతెలియని దుండగులు దీనిని తగలబెట్టి ఉండవచ్చునని స్క్రాప్‌ గోడౌన్‌ యజమాని కోరాడ వైకుంఠరావు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.70 లక్షలు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.