-సీల్, హోదా లేకపోయినా చెల్లుతుందని స్పష్టం
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఘాటుగా సమాధా నమిచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. అటువంటి పోస్టల్ బ్యాలెట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ లేఖ రాశారు. సీఈవో మెమోపై హైకోర్టులో వైసీపీ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఈవో మెమో సరైనదేనని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.