జూపల్లి కారణమని చెప్పినా ఎఫ్ఐఆర్ లేదు
నిందితులను ఎక్కడ దాచారో చెప్పాలి
బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మహానాడు : నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పదిరోజుల ముందే డీజీపీకి నాగర్‌కర్నూల్‌లో పరిస్థితులు వివరించాం. అయినా బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య జరిగింది. జూపల్లి మనుషులు తమ కుమారుడి హత్యకు కారణ మని హతుడి తల్లితండ్రులు చెప్పారు. శ్రీధర్ రెడ్డి గురించి మాట్లాడే మంత్రి జూపల్లి నిందితులను ఎక్కడ దాచారో చెప్పాలని కోరారు. శ్రీధర్‌రెడ్డి హత్యపై సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మాట్లా డుతూ తక్షణమే జూపల్లిపై కేసు నమోదు చేసి మంత్రివర్గం నుంచి తప్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ హింసా రాజ కీయాలకు బీఆర్ఎస్ భయపడడేది లేదని, చావుకైనా వెనకాడమని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, అభిలాష్ రంగినేని, కొమ్ము నరేందర్ పాల్గొన్నారు.