మాజీ ఎంపీ పనబాక లక్ష్మి
గూడూరు, మహానాడు :మహిళలను గౌరవించే ఇల్లు, ఆ సమాజం ఎంతో సుఖసంతోషాలతో ఉంటుందని మాజీ ఎంపి పనబాక లక్ష్మి అన్నారు. ఆ పరిస్థితులను మహిళల అభ్యున్నతి కోసం, మహిళలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన వ్యక్తి, దార్శనీకుడు చంద్రబాబు. మహిళలు కుటుంబ పోషణకు, కుటుంబాన్ని ముందుకు నడిపించేందుకు ఆర్థికశక్తిని సమకూర్చిన వ్యక్తి చంద్రబాబు. మహిళలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. రానున్న కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇప్పటికే పలు పథకాలను చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలతో పేదింటి మహిళలు సంతోషంగా ఉండాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ, సంక్షేమం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.