కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు.
తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ మానవునిలోని దైవాన్ని చూపుతుంది.
జర్నలిస్టు : ” మీరు అలా ఎందుకు చేశారు ”
ఇవాన్ ఫెర్నాండెజ్ : ఏదో ఒకరోజు మనం ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ అందరం గెలిచే సమాజం కోసం అలా చేశాను. ”
జ: మీరు ఆ కెన్యా రన్నర్ కు మీకు రావలసిన బంగారు పతకం ధార పోశారు తెలుసా ?
ఇవాన్ : నేనేం అతనికి సహాయం చేయలేదు. ఈ రేసు అతను గెలవబోతున్నాడు. కేవలం భాష రాకపోవటం వలన ఆయన ఆగాడు.
జ: కానీ మీరు గెలిచేవారే కదా !
ఇవాన్ : అవును. బంగారు పతకం గెలిచేవాడినే. కానీ ఆ బంగారు పతకానికి అప్పుడు ఏమి విలువ ఉంటుంది.
జర్నలిస్టు ఇవాన్ ని వదలకుండా ప్రశ్నిస్తునే ఉన్నాడు.
జ : మీరు బంగారు పతకాన్ని గెలిచేవారే కదా ?
ఇవాన్ : ఆ గెలుపుకు విలువేమున్నది ? నా తల్లి నా గురించి ఏమనుకుంటుంది ? మానవీయ విలువలు ఒక తరం నుండి మరో తరానికి పెరుగుతూ అందింపబడాలి. మన పిల్లలకు మనం అదే నేర్పాలి. మన పిల్లలకు మనం సరైన మార్గంలో వెళ్ళడం నేర్పాలి. తప్పు మార్గంలో వెళ్ళి గెలవడం మన పిల్లలకు నేర్పకూడదు. అలా కాకుండా మానవీయ విలువలు పెంచుతూ ఒకరికొకరం సహాయ పడుతూ పురోగమించాలి. ఎందుకంటే నిజాయితీ, నైతిక విలువలే ఎప్పుడూ విజయం సాధిస్తాయి.
సమాజంలో నైతికత పతనం అవుతున్న నేపథ్యంలో ఈ సన్నివేశం మనుషుల్లో ఇంకా ఏదో మూలన ఉన్న నైతికతను మేల్కొలిపే అవకాశం లేకపోలేదు.