పాల్గొన్న జి.వి.ఆంజేయులు, లావు, మక్కెన
పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు: పట్టణంలోని వై కన్వెన్షన్‌లో ముస్లీం మైనార్టీ, నూర్ బాషాల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త, ఇన్చార్జి కొంజేటి నాగ శ్రీను, టీడీపీ రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షులు సుబహాన్, యువ నాయకులు గోనుగుంట్ల హరీష్‌బాబు, వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ పాల్గొన్నారు.