Mahanaadu-Logo-PNG-Large

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండా

వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు
స్వాతంత్ర్య సమరయోధులకు సత్కారం
జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు, జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. ప్రజలలో చైతన్యాన్ని కలిగించేందుకు ఊరూ వాడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహించుటలో వివిధ శాఖల అధికారులు కీలక భూమిక పోషించాలని కలెక్టర్ ఆదేశించారు.

గురువారం నాస్తి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించు కోవాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజల్లో దేశభక్తి పొందించే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. జాతీయ జెండాతో ఉన్న సెల్ఫీ పొటోలను,వీడియోలను గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా https://hargartiranga.comలో అప్ లోడ్ చేయాలని చదలవాడ నాగారాణి తెలిపారు.