-ఎన్నికల అనంతరం విశ్రాంతి కోసం అమెరికా పయనం
-విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కూడా ఉన్నారు. ఎన్నికల అనంతరం బాబు విశ్రాంతి కోసం ఈనెల 19న ఆమెరి కా వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు పదిరోజుల పాటు సతీమణి భువనేశ్వరితో కలిసి అక్కడే గడిపారు. కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పర్యటన ముగించుకుని వచ్చారు.