పడుగుపాడులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఘన స్వాగతం

కోవూరు, మహానాడు : కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని నేతాజీనగర్‌లో బుధవారం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు నేతాజీనగర్‌ వాసులు, మహిళలు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను స్థానికులు ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.