అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మాణంలో, నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రాన్ని చూడాలనే ఉత్సాహాన్ని ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పెంచింది. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, యూనిట్ సెకండ్ సింగిల్ హమ్మమ్మోను విడుదల చేశారు, ఇది క్లాసికల్ బీట్‌లతో బ్లిస్ఫుల్ మెలోడీ. భాస్కరభట్ల అల్లరి నరేష్ భావాలను తెలియజేసే ఆకర్షణీయమైన సాహిత్యం అందించగా , యశస్వి కొండేపూడి తన చక్కని గానంతో ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు. బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్న అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా ఎలిగెంట్ మూవ్స్ ఆకట్టుకున్నారు.