-కోర్టు చీకొట్టినా జగన్ ప్రభుత్వానికి సిగ్గు లేదు
-బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్శర్మ
అమరావతి: ఈ ప్రభుత్వంలో అత్యున్న అధికారులను జగన్ ఇబ్బందిపెడుతు న్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్శర్మ పేర్కొన్నా రు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యంను తిరుమలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినందుకు తొలగించారని, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. అలానే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావును ఇబ్బందులు పెట్టింది. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా సిగ్గు లేకుండా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు డీజీపీ పోస్టింగ్ లేదా హోమ్ శాఖ ముఖ్య సలహా అధికారిగా అయినా నియమించాలని కోరారు.