ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు
అనంతరం పదవీ విరమణ..ఒకేరోజు కార్యక్రమాలు

విజయవాడ :  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఏబీవీని పలువురు అధికారులు, స్నేహితులు, అభిమానులు కలిసి సంఫీుభావం తెలిపారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.