– మంత్రి సత్యకుమార్
విజయవాడ, మహానాడు: విజ్ఞత, స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నామని, సామాన్యమైన కుటుంబంలో పుట్టి, ఎటువంటి నేపథ్యం లేకున్నా దేశంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. కలాం చేసిన సేవలు ఈ దేశం, ఈ చరిత్ర లో చిరస్థాయిగా ఉంటాయి.. అణు పరీక్షలు ద్వారా భారతదేశం బలాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు.. శాంతికాముక దేశం అయినా… భగ్నం కలిగిస్తే సమాధానం చాలా గట్టిగా ఉంటుందని చూపించారన్నారు.
ఈ దేశ రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో పని చేశారని, దేశంలో ఆయనకు అందని అవార్డు లేదని, పద్మశ్రీ నుంచి భారతరత్న వరకు అన్ని గౌరవాలు పొందారని ఈ సందర్భంగా సత్యకుమార్ గుర్తు చేశారు. నిరాడంబర జీవితం ఆయన గడిపిన తీరు ఆదర్శనీయం. నాకు ఒక సందర్భంలో కలాంని కలిసే అవకాశం వచ్చింది. ఆ తరువాత ఎన్నోసార్లు కలిసినా.. ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే.. ఆయన ఫైల్స్ ను ఆయనే స్వయంగా పట్టుకుని వచ్చే వారు. ఉన్నత స్థానాలకు చేరినా…సాధారణ పౌరుడిగానే భావించే వారు. అన్ని కోణాలను ఆయన స్పృశించారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే దానికి కలాం అందరికీ ఆదర్శనీయం.. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలాం ఆశయాలను లక్ష్యం గా పని చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకోవాలని, శాస్త్రవేత్తగా దేశానికి ఎంతో సేవ చేశారు… కలాం ను రాష్ట్రపతి ని చేసిన ఘనత బీజేపీదేనని తెలిపారు. నిత్య విద్యార్థి గా ఉంటూ చివరి వరకు ఎన్నో నేర్చుకుంటూనే ఉండేవారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, సురేందర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు.