యువతకు స్ఫూర్తి అబ్దుల్ కలాం జీవితం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ఈ పోటీ ప్రపంచంలో యువత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుంటే, ఏ రంగంలోనయిన విజయం తథ్యమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఇక్కడి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరమని, పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుఖవాసి శ్రీనివాస్, మొవ్వా వేణు బాబు, యాకోబు, కదిరి సంజయ్, గుర్రం ప్రసాద్, రమణమ్మ, చింతకాయల రామారావు, తదితరులు పాల్గొన్నారు.