Mahanaadu-Logo-PNG-Large

రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ

హైద‌రాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని తెలిపారు.