బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం: అన్యాయానికి వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన పోరాట పటిమ అమోఘమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశంసిం చారు. ఇతర అధికారులు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఉంటే చాలా కాలం క్రితమే వైసీపీ ప్రభుత్వం బొమ్మల కొలువులో ఉండేదని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు పోరాడిన స్ఫూర్తి ఏబీవీ పోరాటంలో కనిపించిందని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు పోరాట పటిమను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.