చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీపై తొలి సంతకం

కొమ్మాలపాటి శ్రీధర్

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారన్నారు.

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం తో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేయడంతో రైతుల కళ్లలో ఆనంద భాష్పాలు వెల్లువెత్తాయన్నారు.పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేయడంతో అవ్వ తాతలు మా పెద్ద కొడుకుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అంటూ దీవిస్తున్నారు.అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేయడంతో అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు మా కడుపులు నింపుతున్న నువ్వు చల్లగా ఉండాలని దీవిస్తున్నార.నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చారన్నారు.