దర్శి, మహానాడు: మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్టు దర్శి డీఎస్‌పీ లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారని, అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్టు వివరించారు.