ఏపీలో పలువురు అధికారులపై చర్యలు

` పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్‌
` హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు
` తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌ బదిలీ
` పల్నాడు కలెక్టర్‌పైనా చర్యలు

అమరావతి :  ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్‌, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టిం ది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడిరది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌ను ఏపీ ప్రభు త్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ప్రభు త్వం ఆదేశించింది. పల్నాడు జాయింట్‌ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్‌తో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌ను బదిలీ చేస్తూ చీఫ్‌ సెక్రటరీ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. కృష్ణకాంత్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్‌, అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్ధర్‌ను కూడా సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. అధికారుల బదిలీ, సస్పెన్షన్‌ ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.