-ఎస్పీ తుషార్ డూండి
గుంటూరు: సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటు వంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని ఎస్పీ తుషార్ డూండి తెలిపారు. ఎవరైనా అటువంటి సందేశాలు, ఫొటోలు పంపితే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.