వచ్చేనెల 5లోపల యాక్టివ్ మెంబర్షిప్ పూర్తి చేయాలని

– పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ

గుంటూరు, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యశాల(యాక్టీవ్ మెంబర్షిప్ వర్క్ షాప్) కార్యక్రమం ప్రారంభమైనది. సీనియర్ నాయకులు కొత్తూరు వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెంబర్షిప్ ఈ 40 రోజుల కార్యక్రమం దేశ మొత్తం మీద పార్టీకి పండగ లాంటిది. 400 మంది కార్యకర్తలు ఈ జిల్లాలో ఇంటింటికి వెళ్లి పార్టీ ఈ పదేళ్ళు మోడీ ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ మెంబర్షిప్‌ చేసినట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోస్తాంధ్ర జోన్ సభ్యత్వ ఇన్‌ఛార్జి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ దేశంలో అత్యద్భుతమైన పరిపాలన అందిస్తున్న పార్టీ బీజేపీ అంటూ, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఈ స్లోగన్లతోటి అట్టడుగున ప్రజానీకం వరకు పార్టీ చేపట్టిని అభివృద్ధిని తీసుకువెళ్ళినట్టు తెలిపారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జి మకుటం శివ మాట్లాడుతూ పార్టీ యాక్టివ్ మెంబర్షిప్ గురించి వివరించారు. 100 మంది సభ్యులు పూర్తయిన ప్రతి ఒక్క వ్యక్తికి యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తూ పార్టీని బలోపేతం చేయాలని, ఇంకా నాలుగు రోజులు మిగిలిఉందని, ఈ నాలుగు రోజుల్లో అందరూ సహకరించుకుంటూ పార్టీ మెంబర్షిప్ ని పెంచి రాష్ట్రంలోనే అగ్ర జిల్లాగా నిలబెట్టాలని కోరారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ మాట్లాడుతూ మెంబర్షిప్ నాలుగు రోజులే సమయం ఉన్నదని, తరువాత పది రోజులలోపు యాక్టివ్ మెంబర్షిప్ తీసుకోవాలని, వచ్చేనెల ఐదు తారీకు లోపల యాక్టీవ్ మెంబర్షిప్ పూర్తి చేసుకుని రాష్ట్రానికి పుస్తకాలు అంద జేయవలసిందిగా కోరారు. పార్టీ మెంబర్షిప్ జిల్లా ఇన్చార్జి పాలపాటి రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, క్రియాశీల సభ్యత్వ ఇన్చార్జి యడ్లపాటి స్వరూపరాణి, క్రియాశీల సభ్యత్వ ఇంచార్జి జగ్గారపు శ్రీనివాస్, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట నెల్లూరు జిల్లాల ఇన్చార్జులు కొక్కెర శ్రీనివాస్, గాజుల వెంకయ్య నాయుడు, పార్లమెంటు సంయోజక్ బీమినేని చంద్రశేఖర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మెంబర్షిప్ ఇన్చార్జి, యాక్టివ్ మెంబర్షిప్ ఇన్చార్జులు 200 మంది పాల్గొన్నారు.