జగన్ ఇంటిపై కార్యకర్తల దాడి

– జగన్‌పై ‘పులివెందుల’ తిరుగుబాటు
– జగన్ ఇంట్లోనే డౌన్ డౌన్ నినాదాలు
– పవర్‌లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు
– పులివెందులకు చుట్టంచూపుగా వచ్చారు
-తాడేపల్లికే పరిమిత మయ్యారు కదా?
– ఇప్పుడు మళ్లీ పులివెందులకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?
– జగన్ ఇంటిపై దండెత్తిన వైసీపీ కార్యకర్తలు
– అద్దాలు ధ్వంసం చేసిన పులివెందుల ఆగ్రహం
– తలుపులు పగులకొట్టిన వైనం
– జగన్ ఇంట్లోకి వెళ్లే యత్నం
– అడ్డుకున్న జగన్ సిబ్బంది
( మార్తి సుబ్రహ్మణ్యం)

నిన్నటి వరకూ అభిమానుల దృష్టిలో ఆయన పులి. సింహం. సింగిల్‌గా వచ్చే సింహం. ఒక నెల క్రితం వరకూ ఆయన మాటే వేదం. చెప్పిందే శాసనం. ఆయన చల్లని చూపులు, కరుణాకటాక్షాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పడిగాపులు. ఆయన సభల కోసం తరలివెళ్లిన వేలాదిమంది కార్యకర్తలు. మా జిల్లాకు రావాలంటే మా జిల్లాకు రావలని వినతులు. ఇదంతా ఆయన గద్దె దిగకముందు కనిపించిన దృశ్యాలు.

ఇప్పుడు ఆయన ఇంటి ముందు వందలాదిమంది కార్యకర్తల తోపులాట. ఇప్పుడెందుకు వచ్చారంటూ అద్దాలు-తలుపులు పగులకొట్టే తిరుగుబాటు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో కూర్చున్నావ్.అప్పుడు మేం గుస్తుకురాలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మేం గుర్తుకువచ్చామా? అని తలుపులు బాది, నేరుగా ఇంట్లోకే చొచ్చుకుపోయేంత ఆగ్రహం. మరి ఆ సింహం ఏ చేసింది? లోపల తలుపులకు గొళ్లెం పెట్టుకుంది. ఇదీ.. పులివెందులలో మాజీ సీఎం-వైసీపీ అధినేత జగన్ ఇంటిపై పులివెందుల తిరుగుబాటు కథ.

‘సింహం సిక్కయిపోతే పందికొక్కులు ఫ్లూటు వాయించాయ’న్నది ఓ తమిళ డబ్బింగ్ సినిమా డైలాగ్. వైసీపీ అధినేత-మాజీ సీఎం జగన్‌రెడ్డి ఓటమి పరాభవం, చివరాఖరకు సొంత పులివెందులకూ అలుసయిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావ్ అంటూ.. పులివెందుల ఏకకంఠంతో జగన్ ఇంట్లోనే ఉన్నప్పుడే ఆయన ఇంటిపై తిరుగుబాటు చేసి, అద్దాలు, తలుపులు ధ్వంసం చేసిన వైనం వైసీపీని వణికిస్తోంది. జగన్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఏకంగా అధినేతపైనే తిరుగుబాటు చేసేంతంగా తిరగబడ్డ పులివెందుల ఆంధ్ర రాష్టాన్ని ఆశ్చర్యపరిచింది.

ఓటమి తర్వాత తొలిసారి పులివెందుల పర్యటనకు వచ్చిన జగన్‌ను స్వాగతించేందుకు, ఎయిర్‌పోర్టుకు ఎవరూ రాకపోవడం ఒకషాక్ అయితే.. పులివెందుల ఇంటికి వెళ్లిన జగన్ ఇంటిపై వందలాది వైసీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయడం మరో షాక్. కడపకు వెళ్లిన జగన్‌కు చెవిరెడ్డి, అవినాష్‌రెడ్డి, ద్వారనాధ్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, అంజాద్‌బాషా తప్ప ఎవరూ రాకపోవడం షాక్‌నిచ్చింది.

తర్వాత పులివెందులకు వచ్చిన జగన్, కొద్దిసేపటి తర్వాత ఊహించని తిరుగుబాటు ఎదుర్కొన్నారు. జగన్ వస్తున్నారని తెలిసిన వైసీపీ కార్యకర్తలు, వందల సంఖ్యలో ఆయన ఇంటికి తరలివెళ్లారు. అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమయి, తమను పట్టించుకోని జగన్.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని నిలదీసే యత్నం చేశారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలువరించారు. అయినా ఇంట్లోకి తోసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ దృశ్యాలు టీవీ చానెళ్లలో చూసిన వైసీపీ శ్రేణులు బిత్తరపోయారు. వైఎస్ కుటుంబఅడ్డాగా పేరున్న పులివెందులలో, ఆయన ఇంటిపైనే సొత కార్యకర్తలు తిరుగుబాటు చేయటం రాజకీయ వర్గాలను నోరెళ్లబెట్టేలా చేసింది. జగన్ ఇంటిపై కార్యకర్తలు దూసుకువెళుతున్న దృశ్యాలు, టీవీలో చూసిన ప్రజలు కూడా జగన్‌పై జరిగిన తిరుగుబాటును చూసి నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.

జగన్ ఇంటిపై కార్యకర్తల దాడి అబద్ధమట
అయితే జగన్ ఇంటిపై దాడి చేశారన్న వార్తలు అబద్ధమని వైసీపీ ట్వీట్ చేసింది. అవి తప్పుడు వార్తలని, వాటిని నమ్మవద్దని కోరింది.