నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ అగ్నిబాణ్‌

-షార్‌ నుంచి మరో ప్రయోగం విజయవంతం
-దేశంలో మొదటి క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌

శ్రీహరికోట: ప్రైవేట్‌ రాకెట్‌ అగ్నిబాణ్‌ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి దీనిని ఐదవ ప్రయ త్నంలో నింగిలోకి దూసుకెళ్లింది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్‌ గుర్తింపు పొందింది. అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ స్టార్టప్‌కు చెందిన సంస్థ అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. భవిష్యత్‌లో చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.