అరకు: శీతాకాలం వచ్చిందంటే.. అరకు అందాలు కనువిందు చేస్తాయి. ఆ ప్రకృతి సుందర దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ సందర్భంగా అరకు లోయ సందర్శకులకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అరకు అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు హాట్ ఎయిర్ బెలూన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి పద్మావతి గార్డెన్స్లో పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలున్స్ అందుబాటులో ఉండనున్నాయి.