– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
గుంటూరు, మహానాడు: స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు.
వేలాది మంది అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్ లో భారత్ నిరాశజనక ఫలితాలు. అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు అద్భుత ప్రతిభ చూపుతుంటే భారత్ మాత్రం 71వ స్థానానికి పరిమితమైంది. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, రైతుల ఆత్మహత్యల్లో మాత్రం ముందున్నాము. ప్రధాని మోదీ దేశ సంపదను పెత్తందారులకు పంచి పెడుతున్నారు. అంబానీ, అదానీ సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.