మాజీ మంత్రి ఆలపాటి అందలం…

– ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక
– టీడీపీ హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, మహానాడు: గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేశారు. ఆలపాటి అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మంగళవారం పొద్దుపోయే వరకు జరిగిన పార్టీ ఇన్‌చార్జీల సమావేశంలో ఆలపాటి రాజా కు విషయం చెప్పిన అధిష్ఠానం. పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ పరంగా అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని అగ్రనేతలు హామీ ఇచ్చారు.