వైసిపి పాలన లో వ్యవస్థలు అన్ని సర్వ నాశనం

– ఇంటింటికీ వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు.

వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం శనివారం నాడు రేమిడిచర్ల ,మన్నేపల్లి తండా మరియు గంగుపల్లి తండా గ్రామలలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, నిర్వాకాలను ఒక్కొక్కటిగా ఆయన ఎండగట్టారు.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక, రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్ల అక్రమంగా మద్యం ఇసుక/మట్టి/ బియ్యం/ మాఫియాతో/ వందల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకున్నారు.పేదలు ప్రశాంతంగా బ్రతకాలన్నా, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్నా,రైతులు సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు అధికారంలోకి రావాలన్నారు.

అందరి పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలని, జగన్ రెడ్డి మాత్రం చేపల కోట్లు, మటన్ కొట్లు తీసుకువచ్చి యువత జీవనం నాశనం చేశాడు. నీకు కాలం చెల్లింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన నీకు బుద్ది చెప్పడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్దంగా ఉన్నారు.చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకువచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిది,తల్లికి వందనం ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు,అన్నదాత పథకంతో రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం,యువగళంతో యువతకు 3000 నిరుద్యోగ భృతి,బీసీలకు రక్షణ చట్టం,ఇంటింటికి కుళాయి అమలవుతాయని పేర్కొన్నారు.

నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశాడు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్రెడ్డి. ప్రశ్నించే వారిపై పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కేసులు పెట్టినందుకా వై నీడ్ జగన్.ఎన్నికల ముందు వరికపొడిసెల ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లు గడిచిన పనులు ప్రారంభించకుండా మోసం చేశాడని అన్నారు. బొల్లాపల్లి మండలానికి సీఎం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ప్రజలకు గుర్తు చేశారు.

జనసేన, టిడిపి శ్రేణులు కలిసి పనిచేసి రాచక వైసిపి పాలనను ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మండల నాయకులు పెమ్మసాని నాగేశ్వరావు , జరపాల గోవిందు నాయక్ , ఆళ్ల మన్నయ్య, సక్రు నాయక్,అర్దలపూడి శ్రీనివాసరావు, దాసరి కోటేశ్వరావు గారు, తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు, బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి , ఎలిశెట్టి రంగయ్య, బొమ్మన బోయిన వెంకట కోటయ్య, ఉరిబిండి ఏడుకొండలు, తిరుమలపుడి మనేయ, వాగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.