– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏడాది క్రితం ప్రతిపక్ష నేతగా ఉండగా నాటి జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితం, కక్షతోనేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. అధర్మం తాత్కాలికంగా గెలవొచ్చు… అంతిమ విజయం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుందని, చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్ అదే విషయాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారన్నారు.
జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏ తప్పు చేయలేదు కాబట్టే చంద్రబాబు జైలు నిర్భంధాల నుంచే ఫీనిక్స్ పక్షిలా ఎగిరి మళ్లీ ముఖ్యమంత్రి సింహాసనం అందుకున్నారని తెలిపారు. 2023 సెప్టెంబర్ 9న నాటి వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అర్ధరాత్రి అక్రమ అరెస్టుకు ఏడాది అయిన సందర్భంగా సోమవారం ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేవలం తనకు ప్రత్యర్థులు ఉండకూడదనే జగన్ ఆ రోజు తప్పుడు నిర్ణయంతో నిరంకుశంగా చంద్రబాబును అరెస్టు చేశారన్నారని దుమ్మెత్తిపోశారు.