ప్రజలందరిపై శ్రీ సరస్వతి అమ్మవారి దీవెనలు ఉండాలి

– గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము

గుడివాడ, మహానాడు: ప్రజలందరిపై సకల విద్యలకు మూలమైన శ్రీ సరస్వతి అమ్మవారి దీవెనలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనీగండ్ల రాము అమ్మవారిని వేడుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ సరస్వతి పూజల్లో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు పుస్తకాలు, పలకలు అందించి…. స్వయంగా అక్షరాభ్యాసాలు చేయించారు. అమ్మవారి దీవెనలతో చిన్నారులు, యువత చక్కటిగా విద్యనభ్యసించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ముందుగా మేల తాళాలు పూర్ణకుంభంతో…. వేద పండితులు దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలు, చిన్నారులకు అందించే పుస్తకాలు, పెన్నులు, పలకలను శిరస్సుపై ఉంచుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేసిన ఎమ్మెల్యే.. పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ సరస్వతి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పర్వదినం రోజు…… నవరాత్రి మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, దేవస్థాన ఈవో కెవీ కోపాలరావు, జనసేన పార్టీ ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు, పండ్రాజు సాంబయ్య, వడ్డాది నాగరాజు, తెలు శ్రీను, మిక్కిలినేని రమేష్, గడ్డం ప్రకాష్ దాస్, ఏలూరి వీరయ్య…. పెద్ద సంఖ్యలో భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు.