తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బోస్ రోడ్డులోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల సమన్వయ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో పార్టీల నేతలు పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సంద ర్భంగా మనోహర్ మాట్లాడుతూ పార్టీల అధినాయకత్వం పిలుపుమేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూటమి శ్రేణుల సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతుంద న్నారు. నియోజకవర్గంలో అనుసరించాల్సిన పార్టీ ప్రచారం, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎలా ముందుకు సాగాలి అన్న అంశాలపై చర్చించారు. సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.