కూటమి గెలుపు తథ్యం: కొలికపూడి

తిరువూరు, మహానాడు : ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌ శుక్రవారం పర్యటించారు. మండల పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. ఎన్నికల్లో అందించిన సహకారం మరవలేనిదన్నారు. కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.