ఏలూరు: త్వరలో జరగనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికల నిమిత్తం, ఏలూరులో గల హోటల్ అతిథి లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఎన్ డి ఏ కూటమి శాసనసభ్యులు, ఇంచార్జులు, జిల్లా అధ్యక్షులు, ఎం.పి లు మరియు జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లాలా పట్టభద్రుల ఎం ఎల్ సి లో పోటీచేసే కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ ను సభకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి వేపాడ చిరంజీవి, రెడ్డి సుబ్రమణ్యం, నిమ్మల రామానాయుడు, పితాని సత్యన్నారాయణ, చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ, సొంగా రోషణ్, బొలిశెట్టి శ్రీను, పత్సమట్ల ధర్మరాజు, మంతెన రామరాజు, బూరుగుపల్లి శేషారావు, వలవల బాబ్జీ, ఘంఠా మురళీ, బొరగం శ్రీను, తెలుగుదేశం, జనసేన, బిజెపి నియోజకవర్గాల ఇంచార్జులు మరియు ఇతర కూటమి సభ్యులు పాల్గొన్నారు.