– మంత్రి సవిత చేతుల మీదుగా సీఎం సహాయ నిధికి అందజేత
విజయవాడ, మహానాడు: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత చేతుల మీదుగా రూ.3.30 లక్షలను 29 గ్రామాల రాజధాని రైతులు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి మంత్రి సవిత చేతుల రూ.3.31లక్షల చెక్ ను అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతులు చిట్టిబాబు, శ్రీధర్, రవి, అనిల్, శ్రీనివాస్ సహా 29 గ్రామాల రాజధాని రైతులు పాల్గొన్నారు.