21న బెంగుళూరులో అమరావతి విజయోత్సవ సభ

-కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు రామస్వామి వెల్లడి

ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు కర్ణాటక తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో అమరావతి విజయం, నిజం గెలిచింది పేరిట విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు దొందు రామస్వామి తెలిపారు. శనివారం అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తో కలిసి ఆయన విజయోత్సవ సభకు పలువురు ఎపీ మంత్రులను ఆహ్వానించారు. ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, బిసి వెల్ఫేర్ మంత్రి సబితా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి లను ఏపీ సచివాలయంలో స్వయంగా కలిసి ఆహ్వానించారు. బెంగుళూరు అమరావతి విజయోత్సవ సభలో అమరావతి మరియు దళిత ఉద్యమ నాయకులు బాలకోటయ్యను అభినవ జాషువా అవార్డుతో సత్కరిస్తున్నట్లు చెప్పారు. సమితి ప్రధాన కార్యదర్శి బాబు రాజేంద్ర ప్రసాద్, నారాయణ తదితరులు ఉన్నారు.