ఆవేశపడకు బొత్సా…

బొత్సకు కౌంటర్
-టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, మహానాడు :హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన నేపథ్యంలో వైసీపీ నేత బొత్స చేసిన వ్యాఖ్యలను పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఖండించారు.

ఈ సందర్బంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు… మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాం అని చెప్పిన మాటలు మర్చిపోలేదు. బందర్ పోర్టులో వాటా ఇస్తామని చెప్పిన విషయమూ మర్చిపోలేదు. తాళాలు పగలగొట్టి ఎపీ ఆయుష్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటే నోరు మూసుకున్న విషయం కూడా మర్చిపోలేదు. పోలవరం నీళ్ళు కేసీఆర్ తీసుకుని వెళ్తాం అని చెప్పిన మాటా మర్చిపోలేదు. పోలవరం ఎత్తు తగ్గించమని జగన్ కి చెప్పానని కేసీఆర్ చెప్పింది కూడా మర్చిపోలేదు. కేసీఆర్ కాళ్ల మీద విజయసాయి రెడ్డి పడిన విషయమూ మర్చిపోలేదని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసమే పని చేస్తారన్నారు. మీలాగా కేసుల కోసం, ఆస్తులు కాపాడుకోవాల్సిన పని ఆయనకు లేదని పేర్కొన్నారు.