ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర
గుంటూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి
సత్తెనపలి, మహానాడు : సత్తెనపల్లిలో భారీ తేడాతో ఓడిపోతున్నానని తెలుసుకున్న అంబటి రాంబాబు రౌడీ మూకలను వెంటేసుకుని నియోజకవర్గం మొత్తం హల్చల్ చేస్తున్నాడని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించి ఓటర్లలో భయభ్రాంతులకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలన్న కుట్ర జరుగుతుందన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే కూటమి నాయకులు, అధికారుల కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఓటింగ్ శాతం 80 శాతం దాటుతుందన్న సమాచారంతో వైసీపీ మూకలు రెచ్చిపోయారన్నారు. అధికారులు తక్షణమే వాటిని నివారించి సజావుగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు.