బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు

హైదరాబాద్‌, మహానాడు: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ తదితరులు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కె.లక్ష్మ ణ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదంతో దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీలకు సముచిత స్థానం కల్పిస్తు న్నారని, 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యారని పేర్కొన్నారు.

డాక్టర్‌ అంబేద్కర్‌ జీవితంతో ముడిపడిన చారిత్రాత్మక స్థలాలను భారత ప్రభుత్వం పంచతీర్థాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఢల్లీిలో అంబేద్కర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించిందని, రాజ్యాంగా నికి లోబడి మోదీ పనిచేస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రజాస్వామ్యాన్ని అవమానించారన్నా రు. లోక్‌సభ ఎన్నికలలో రెండు సార్లు అంబేద్కర్‌ను ఉద్దేశపూర్వకంగా ఓడిరచిన చరిత్ర నెహ్రూ, కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.