అమ్మా… కృష్ణమ్మ రాష్ట్రం బాగుండాలి

– జలహారతులు ఇచ్చిన ఎమ్మెల్యేలు ప్రవీణ్, శ్రీరామ్

పులిచింతల, మహానాడు: పులిచింతల పాజెక్ట్ వద్ద కృష్ణమ్మకు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ చిన తాతయ్య బుధవారం జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. కృష్ణా జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. పులిచింతల గేట్లు పర్యవేక్షించి అధికారుల సూచన మేరకు గేట్లు లిఫ్ట్ చేసాం. రాష్ట్రం మొత్తం బాగుండాలని కృష్ణమ్మను కోరుతున్నాం.

చంద్రబాబు అధికారంలోకి రాగానే మెట్టమొదటిగా రాష్ట్రంలోని అన్నిప్రాజెక్టులపై అధికారులతో సమీక్షలు జరిపారు. పులిచింతల ప్రాజెక్టు అతిథి గృహం లో వరదనీటి పై అధికారులతో సమీక్ష నిర్వహించాం. పులిచింతల ప్రాజెక్టు కు ఎగువ నుండి భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గత పాలకులు ప్రాజెక్ట్ లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు లేకుండా చేశారు. లోతట్టు ప్రాంతాల వారినీ అప్రమత్తం చేశాం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నాం. టెండర్ ప్రక్రియ ముగిసింది, త్వరలో నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతాం. వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం.