అమ్మో పులి.. అంతా ఉత్తిదే!

– ఆకతాయిల మార్ఫింగేనన్న అటవీఅధికారి
– నిర్భయంగా ఉండాలని సూచన

రాజమండ్రి: గత కొద్దిరోజుల నుంచి పులి సంచార వార్తతో భీతిల్లుతున్న రాజమండ్రి, పరిసర వాసులకు రాజమహేంద్రవరం ఇన్‌చార్జి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్‌.భరణి ఊరటనిచ్చే కబురు చెప్పారు. అసలు ఈ ప్రాంతంలో పులిసంచారమేలేదని, అదంతా ఆకతాయిల సృష్టి మాత్రమేనని తేల్చారు. అధికారి ఏమన్నారంటే… స్ధానిక నామవరం గ్రామం, సి-బ్లాక్ 11వ వీధిలో అధికారులు వచ్చి విచారించారు. కొందరు ఆకతాయిలు చేసిన ఫేక్‌ ఫోటోగా గుర్తింపు … ఎటువంటి వదంతులు నమ్మవద్దు.

ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ అటవీ ప్రాంతంలోనే చిరుతపులి ఉన్నట్టుగా గుర్తించాం. ఇందులో జతపరిచిన 1 వ ఫోటో మార్పింగ్ చేసి 2 వ ఫొటో ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టు గుర్తింపు. ట్రాప్ బోనులో చిరుతపులి పడలేదు. మరి ఏ ఇతర బయట ప్రాంతాల్లో చిరుతపులి సంచరించడం లేదు.