ఫలితాల్లో అవకతవలపై అనుమానాలున్నాయి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 5న దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పరీక్షను రాశారని, ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగా యని విద్యార్థులు, విద్యార్ధి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం, వారి పరీక్ష కేంద్రం ఒక్కటే కావడం అనుమానాలకు బలాన్నిస్తుందన్నారు. ఫలితాలపై, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు.