అవే పిన్‌లతో సైబర్‌ నేరగాళ్లకు అవకాశం

హైదరాబాద్‌: భారత్‌లో అధికశాతం ప్రజలు 1234, 1111, 0000, 9999 వంటి పాస్‌వర్డ్‌లనే పిన్‌లుగా పెట్టుకుంటున్నట్లు చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ చేసిన సర్వేలో వెల్లడైం ది. దీంతో సైబర్‌ నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్‌ చేయగలుగుతున్నారని ఈ నివేదికలో పేర్కొంది. పుట్టిన తేదీ, బైక్‌ లేదా కార్‌ నెంబరు లేక లక్కీ నెంబర్‌నో పిన్‌ గా పెట్టుకోవడమంటే సైబర్‌ నేరస్థులను తక్కువ అంచనా వేయడమేనని హెచ్చరించింది.