విరాళాల వెల్లువ

అమరావతి, మహానాడు: వరద బాధితులకు సాయం నిమిత్తం పలువురు దాతలు స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ విరాళాల చెక్కులను అందజేశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలు 85 వేలు విరాళాన్ని అందజేశారు. అలాగే, ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రూ.3 లక్షల 11 వేల 116. తుళ్లూరు గ్రామ రైతులు రూ.8 లక్షలు, ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్(న్యూజిల్యాండ్) రూ.2 లక్షల 70 వేలు అందజేశారు. దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.