అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునే నిమిత్తం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి లోకేష్‌కు సోమవారం పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. గూడురు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నేతలు కలిసి రూ.34,47,442 లు, హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ ఆర్ట్స్ ఛైర్మన్ సీడీవీ సుబ్బారావు రూ.25 లక్షలు, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన పీవీఎస్ లేబరేటరీస్ అధినేత పీవీ శేషయ్య రూ.10 లక్షలు, పెనమలూరుకు చెందిన ఎంవీఆర్ చౌదరి రూ.5 లక్షలు అందజేశారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.