టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్
ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసిపి ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తొస్తోంది. దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యంను హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్నా ఆయనకు బుద్దిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దళిత సమాజంలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నా ఆయనలో ఏమాత్రం పరివర్తన కన్పించడం లేదు. పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన నేరానికి కూనవరం మండలం కూటూరులో ఆదివాసీ సోదరులపై గన్ మ్యాన్ తో దాడిచేయించి మరోమారు తన రాక్షస ప్రవృత్తిని చాటుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సోదరులపై దమనకాండ సాగిస్తున్న అనంతబాబుతోపాటు అతడ్ని పెంచిపోషిస్తున్న తాడేపల్లి ప్యాలెస్ ను బద్ధలుగొట్టడానికి 5కోట్లమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తించాలి.