కూటమి గెలుపునకు ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ ప్రచారం

జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని వెల్లడి

అమరావతి, మహానాడు : ఉద్యోగులను శత్రువులుగా చూస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా, కూటమి గెలుపు కోసం ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ చేపట్టిన ప్రచార యాత్ర బుధవారం ముగిసింది. అనంతపురంలో ఎన్నికల ప్రచార యాత్ర ముగింపు సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ మాట్లాడుతూ కూటమి 151 సీట్లు గెలవబోతుందని తెలిపారు. టీడీపీ అనంతపురం అభ్యర్థి దగ్గుబాటి మాట్లాడుతూ పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్లు పడేలా చర్యలు తీసుకుంటామని, పెన్షనర్ల సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్‌: బి.పెద్దన్న గౌడె, రాష్ట్ర కార్యదర్శి పి.యస్‌.ఎన్‌.మూర్తి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయరామప్ప, ట్రెజరర్‌ తూము నాగభూషణం, కె.వెంకటేశ్వరరావు, రామకృష్ణ, వెంకట రమణ, ప్రభాకర్‌, పాల్గొన్నారు.