ఇందుకే ఏపీకి జగన్ కావాలి
ఎంపీ విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిరేటు 2018-19లో 3.2 శాతం ఉండగా, 2021-22 నాటికి 12.8 శాతానికి పెరిగిందని ప్రస్తుతం పారిశ్రామిక వృద్ది రేటులో ఆంద్రప్రదేశ్ దేశంలోనే 3 వ స్థానంలో ఉండగా.గత చంద్రబాబు పాలనలో 22వ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలన్న వాదనకు ఇదే సరైన సమాధానమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్.మీడియా వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో దేశంలోనే అగ్రగామిగా విశాఖ
ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషితో రోడ్డు ప్రమాదాల్లో 34.5% తగ్గింపుతో రోడ్డు భద్రతలో వైజాగ్ భారతదేశంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ఈ అద్భుతమైన ఫలితం సాధించడంలో
వైజాగ్ పోలీసులు మరియు జివిఎంసి కృషి అమోఘమైనదని అన్నారు. భద్రతా మౌళిక సదుపాయాలు పెంచడం, ప్రజలతో సన్నిహితంగా ఉండటం ఉత్తమ ఫలితాలనిచ్చిందని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కు ఇది చక్కటి ఉదాహరణని అన్నారు.
పురందేశ్వరికి ప్రజలపై చులకన భావన
పురందేశ్వరి ప్రజల తెలివితేటలపై చాలా చులకన భావంతో ఉండడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో మద్యం మృతులు 50 లక్షల మంది అంటూ దిగ్భ్రాంతి కలిగించే అబద్ధాన్ని అవలీలగా చెప్పడం అవివేకమని అన్నారు. కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకుని కుడి కంటికి కట్టుకట్టుకున్న బావ ఎడమ కంటిలో ఆనందం చూడటం కోసమే ఆమె ఇలాంటి అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు.
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మౌళిక సదుపాయాలు
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం జగన్ కల్పించిన మౌలిక సదుపాయాలు దేశానికే ఆదర్శమని అన్నారు. 15వేలు పైచిలుకు గ్రామపరివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్ లు, 542 అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు గ్రామ స్వరాజ్యంలో సీఎం జగన్ తెచ్చిన పెనుమార్పులని విజయసాయిరెడ్డి అన్నారు.