స్వర్ణాంధ్ర కానున్న ఆంధ్ర!

-నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని 33 వ వార్డులో సోమవారం స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలు, నాయకులు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు సహాయం చేయాలనే చంద్రబాబు పిలుపుతో మూడు రోజుల్లో 350 కోట్ల విరాళాలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ఇవ్వడం కూటమి ప్రభుత్వం పై నమ్మకానికి నిదర్శనమన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఏ ఆపద వచ్చినా దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు కాదని కారణం వైసీపీ నేతలు విరాళాలు దోచేస్తారన్న భయం ఉండేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వం పై నమ్మకం చంద్రబాబు నాయకత్వం పట్ల విశ్వాసంతోనే విరాళాలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ప్రజా సంక్షేమానికి కృషి చేసిందని, ఈ 100 రోజుల పాలనను చూస్తే రానున్న ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా మారడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.