– వైసీపీ పాలనలో అన్నీ విధ్వంసాలే..
– సంక్షేమం, అభివృద్ధి కూటమితోనే సాధ్యం
– టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
పూరిమెట్ల, మహానాడు: ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, తిరిగి రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించేందుకు సమిష్టి కృషి అవసరమని, ఇది ఎన్డీయే పాలనలోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ముండ్లమూరు మండలం శంకరాపురం, నూజల్ల పల్లి, మారెళ్ల, జమ్మలమడక, పూరిమెట్ల గ్రామాల్లో శనివారం రోడ్లు, డ్రైన్ ల అభివృద్ధి పనులకు లక్ష్మి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తాను చేస్తున్న నిరంతర కృషిని, పడుతున్న తపనను మాకు వివరించారు. ఆయన స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ వారోత్సవాలు పేరుతో పల్లె పండుగను ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధి కోసం నిధులను కేటాయించి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకునే ఒక సదవకాశాన్ని అందజేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గ్రామాలలో అభివృద్ధి పనుల నాణ్యతత, ప్రజల జవాబుదారితనంతో మంచి చేయాల్సిన అవసరం బాధ్యత ఉందన్నారు. అధికారులు, పార్టీ నేతలు, కూటమినేతలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి కోసం పాటుపడదామన్నారు.
త్వరలో దర్శి పట్టణంలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేయబోతున్నామని, దీపావళి కానుకగా మహిళలకు ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమల్లోకి వస్తుందని లక్ష్మి ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దొనకొండ ప్రాంతంలో వలసలు నివారించేందుకు పారిశ్రామిక వాడ పనులు తిరిగి ప్రారంభమయ్యే విధంగా ముఖ్యమంత్రి తో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ఎంపీడీవో, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీపీ మందలపు వెంకట్రామయ్య, మాజీ జెడ్‌పీటీసీ కొక్కెర నాగరాజు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, క్లస్టర్ సుంకర రాఘవ రెడ్డి, వివిధ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.