అన్న సమారాధన గొప్పది

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: అన్ని దానాలలోకెల్లా అన్న దానం చాలా గొప్పదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీనివాసరావు పేట 1వ లైన్, బ్రాడిపేట 1/17వ లైన్, మంగళ దాస్ నగర్ లో వినాయక చవితి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్న సమారాధన గొప్పది అని అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారని అన్నారు. భగవంతుడి సేవలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పదిమంది ఆకలి తీర్చడం నిజంగా ఒక అదృష్టమని, పేద ప్రజలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ అలవాటు చేసుకోవాలన్నారు.