చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ

టీడీపీలోకి జెడ్పీటీసీ కోడే సుధారాణి
నారా లోకేష్‌ సమక్షంలో చేరిక

చిలకలూరిపేట, మహానాడు: నిన్నటిదాకా వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్‌నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్‌ జెడ్పీటీసీ కోడే సుధారాణి కుటుంబసభ్యుల తో వైసీపీని వీడి ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతో నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. అధికార పార్టీ ప్రతినిధి అయినా తనకు ఎటు వంటి ప్రాధాన్యం లేదని, ప్రజలకు న్యాయం చేయలేకపోయానని వివరిం చారు. ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ అని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ మూడు మండలాల్లో యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల వైసీపీ జెడ్పీటీసీలు టీడీపీలోకి వచ్చారు.